హైదరాబాద్, (ప్రభ న్యూస్) : బాదములలో అత్యధికంగా పోషకాలు ఉండటంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచే, శరీరానికి శక్తిని అందించే లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. బాదములలో విటమిన్‌లు, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజాలను కలిగిస్తాయి. మెరిసే చర్మానికి మాత్రమే కాదు, గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు, మధుమేహ నియంత్రణకు సైతం బాదములు తోడ్పడతాయి. బాదములలో విటమిన్ ఈ అధికంగా ఉంది.
యాంటీ ఏజింగ్‌గా ఇది పనిచేయడంతో పాటుగా కాంతివంతంగా చర్మం మెరిసేందుకు సైతం తోడ్పడుతుంది. మధుమేహ నియంత్రణిగా కూడా బాదములు తోడ్పడుతున్నాయని, సమతుల ఆహారంగా ఉంటూ గ్లూకోజ్ మెటబాలిజం మెరుగు పరచడంలో బాదములు తోడ్పడతాయని డైటీ షియన్లు వెల్లడిస్తున్నారు. బాదములను నేరుగా లేదంటే నానబెట్టి లేదా కాస్త ఉప్పు జోడించి ఫ్రై చేసి కూడా తినొచ్చని, ఏ విధంగా తీసుకున్నా.. దీనితో ప్రయోజనాలు మాత్రం అధికంగానే ఉంటాయని ఆ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.