Sunday, November 17, 2024

What an Idea – పెళ్లి ఊరేగింపు మార్గం లో కూల‌ర్లు…చ‌ల్ల చ‌ల్ల‌గా సాగిన వేడుక

ఇండోర్ – ఓ వైపు ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. మరోవైపు జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వేడుకలో జరిగే ఊరేగింపుకి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ లో పెళ్లివారు వేడిని తట్టుకోవడానికి ఊరేగింపుగా వెళ్లి మార్గం 1.5 కి.మీ పొడవునా కూలర్లు ఏర్పాటు చేశారు. ఈ కూలర్లు ట్రాలీలో ఉంచిన జనరేటర్లకు క‌నెక్ట్ చేశారు.

ఇక చల్ల చల్లగా గాలి వీస్తుంటే పెళ్లికి వచ్చిన అతిథులు పెళ్లి సంబరాలు సంతోషంగా జరుపుకున్నారు. @Anurag_Dwary అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వాట్ యాన్ ఐడియా సర్ జీ’ అని.. ‘ఈ వీడియోను మెచ్చుకోకుండా ఉండకండి’ అంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియోకి బోల్డ్ లైక్ లు , వ్యూస్, కామెంట్స్ వ‌స్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement