Friday, November 22, 2024

సరిహద్దు భద్రత సంగతేంటి..? మోడీకి రాహుల్‌ సూటి ప్రశ్న..

పంజాబ్‌లో నెలకొన్న ప్రధాని మోడీ భద్రతాపరమైన లోపం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నది. నాటి నుంచి బీజేపీ-కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తాజాగా ఈ విషయమై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం స్పందించారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ.. టిట్టర్‌ వేదికగా భారత్‌ సరిహద్దు వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

తమ సరిహద్దులో ప్రస్తుతం జరుగుతున్నది దేశ భద్రతలోని అతిపెద్ద లోపం అని చెప్పుకొచ్చారు. ప్రధాని దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? అని రాహుల్‌ ప్రశ్నించారు. పాంగాంగ్‌ త్సో, చైనా హాష్‌ ట్యాగ్‌లను రాహుల్‌ టీట్‌లో పెట్టారు. దీన్ని బట్టి పాంగాంగ్‌ సరస్సుపై చైనా అక్రమంగా నిర్మిస్తున్న వంతెనను పరోక్షంగా రాహుల్‌ ప్రస్తావించినట్టు అర్థం అవుతున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement