భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి డొమినికలో తొలి టెస్టు ప్రారంభం కానుండగా, జులై 20న పోర్ట్ ఆప్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో రెండో టెస్ట్ జరుగనుంది. అనంతరం వన్డే సిరీస్ జరుగనుంది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో దారుణ ఓటమితో బీసీసీఐ మేల్కొంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా యువకులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటనకు యంగ్‌స్టర్స్‌ను సెలెక్ట్ చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన నయావాల్ చతేశ్వర్ పుజారాపై వేటు పడింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే స్థానం నిలబెట్టుకున్నాడు. అనుభవజ్ఞుడైన అతను టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు. టాలెంట్ దండిగా ఉండి కూడా జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న సంజూ శాంసన్ వన్డే జట్టు వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్-16 సీజన్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ వన్డే, టెస్టు జట్టులోని 16మందిలో చోటు సంపాదించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన యువ సంచలనం యశస్వీ జైస్వాల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. కరీబియన్ పర్యటనకు వెళ్లనున్న భారత బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేసింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు.
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనా.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దిప్‌యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్