భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ను రెండు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి విస్తృతమవడంతో బీసీసీఐ టెక్నికల్ కమిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం ప్రకటించనుంది. మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్, విండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లను కోల్‌కతా, అహ్మదాబాద్ వేదికలుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వన్డే సిరీస్‌ను ఒక వేదిక, టీ20 సిరీస్‌ను ఒక వేదికపై నిర్వహించనున్నారు. కాగా ఫిబ్రవరి 6నుంచి భారత్‌లో విండీస్ పర్యటన ప్రారంభంకానుంది. ఇంతకుముందు వన్డే సిరీస్‌ను అహ్మదాబాద్, జైపుర్, కోల్‌కతాలో అదేవిధంగా టీ20 సిరీస్‌ను కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..