టీమిండియాతో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు సీనియర్లకు ఆహ్వానం పలికారు. టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం నేపథ్యంలో కీలక ఆటగాళ్లకు జట్టులో చోటుకల్పించారు. షిమ్రాన్ హిట్‌మెయిర్, ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌లను వన్డేలకు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత వీరికి జట్టులో చోటుదక్కడం విశేషం. మరోవైపు పేసర్ జయ్‌డెన్ సీల్స్, లెగ్ స్పిన్నర్ యన్నిక్ కరియలకు కూడా 15మంది బృందంలో చోటు కల్పించారు. వీళ్లిద్దరూ ఈమధ్యే సర్జరీ నుంచి కోలుకుని రిహెబిలిటేషన్ సెంటర్‌లో ఫిట్‌నెస్ సాధించారు.
మరో స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా వన్డే జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. గాయపడిన ఆల్‌రౌండర్ కీమో పాల్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్, సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు వన్డే సిరీస్‌కు దూరం అయ్యారు. జూలై 27 నుంచి వన్డే సిరీస్ నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన విండీస్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు మేటి జట్లలో ఒకటైన వెస్టిండీస్ ప్రపంచ కప్ ఆడకపోవడం అనేది 17 ఏళ్లలో ఇదే తొలిసారి.
వెస్టిండీస్ వన్డే స్క్వాడ్: షై హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యాన్నిక్ కరియ, కేసీ కార్టి, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హిట్‌మెయిర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోతీ, జేడెన్ సీలెస్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, ఒషానే థామస్.