కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్ అని స్టిక్కర్ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం వద్దకు చేరుకున్నాడు. గన్, కత్తి కలిగిన అతడు భద్రతా లేన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిలువరించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.