బెంగాల్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలలో ఒక్కొక్కరి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు.. ప్రమాదవార్త తెలిసివెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారని, వారిలో లోకో డ్రైవర్ కూడా ఉన్నారని చెప్పారు.. అలాగే మరో 51 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు…
- Advertisement -