కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన నిరసిస్తూ అక్కడి డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యం లో..సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జరిపిన చర్చలు విజయవంత అయ్యాయి . ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు.
వైద్యులు చేసిన నాలుగు డిమాండ్లలో ప్రభుత్వం ఆమోదించింది. అత్యాచారం-హత్య కేసు విచారణను ఇప్పటికే సీబీఐ చేపట్టింది. ఇది కూడా డిమాండ్లలో ఉంది. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ని తొలగించేందుకు సీఎం ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరసన చేపడుతామని వైద్యులు వెల్లడించారు. కోల్‌కతా కమిషనర్‌తో పాటు ఆరోగ్య శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల్ని కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ వైద్యుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ రాజీనామాకు సిద్ధమని సమావేశంలో చెప్పారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వినీత్ కొత్త సీపీకి బాధ్యతలు అప్పగిస్తారు” అని మమతా బెనర్జీ తెలిపారు.
వైద్యులు ప్రతిపాదించిన 5 డిమాండ్లకు సీఎం అంగీకరించినట్లు తెలిసింది. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని ఆమె తెలిపారు. నిరసన తెలిపే వైద్యులపై ఎలాంటి శిక్షార్హత చర్యల్ని తీసుకోబోమని మమతా బెనర్జీ చెప్పారు..