పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ప్రజల కోసం తన పరదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. హత్యకు గురైన ఆర్‌జి కార్ ఆసుపత్రి డాక్టరుకు న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని అన్నారు. ఆర్‌జి కార్ ఆసుపత్రి ప్రతిష్టంభన నేడు ముగిసిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని (గురువారం) విలేకరుల సమావేశంలో మమత తెలిపారు.
సచివాలయానికి డాక్టర్లు వచ్చారు కాని సమావేశంలో మాత్రం కూర్చోలేదని ఆమె అన్నారు. విధులకు తిరిగి వెళ్లాలని వారిని అర్థిస్తున్నానని మమత అన్నారు. గత మూడు రోజులుగా డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలకు హాజరు కావడం లేదు. ఈ చర్చలను ప్రత్యక్షప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. న్యాయం కోసం తాను రాజీనామాకైనా సిద్ధమే అని సీఎం మమతా ప్రకటించడంతో బెంగాల్‌లో రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.