పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లయ్చేస్తున్న వ్యక్తిని సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి)కి చెందిన నార్కోటిక్స్ సెల్ బృందం బుధవారం నదియాలో డ్రగ్స్ పెడ్లర్‌ను అరెస్టు చేసింది. అతని నుంచి రూ. 3 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని జుళ్లూరు రెహమాన్‌గా గుర్తించారు. అతని బ్యాగ్‌లో బ్రౌన్ పౌడర్ లాంటి పదార్ధంతో కూడిన మూడు ప్యాకెట్లు కనిపించాయని సీఐడీ అధికారులు తెలిపారు. ఆ ప్యాకెట్లలో ఉన్న వాటిని ల్యాబ్‌లో టెస్టు చేయగా అది హెరాయిన్ అని తేలిందని, దాంతో CID అధికారులు నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
కాగా, నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సుమారు 2.85 కిలోల బరువు ఉంటుంది. హెరాయిన్ మార్కెట్ విలువ ప్రకారం.. రూ.2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జుల్లూర్ రెహమాన్‌పై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కలిగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతడిని కృష్ణానగర్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కోసం అతడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించనున్నారు.