బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్భవన్లో తన వ్యక్తిగత భద్రత కొరవైందన్నారు. తనపై పోలీసు సిబ్బంది నిఘా ఉంచారని దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇటీవల గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత గొడవలు జరుగగా బాధితులతో కలిసి గవర్నర్ను కలిసేందుకు వచ్చిన విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కొలకత్తా కోర్టుకు వెళ్లగా అనుమతి ఉంటే గవర్నర్ను కలవచ్చని తీర్పునిచ్చింది. ఈ విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -