రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకూరు ..అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టులో ఆరు లక్షల 30 వేల చేప పిల్లలను ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువు లో వదిలారు. రామన్ పాడులో 3.30.000 లో ఆయన చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడు మత్స్య కారులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. మత్స్యకారులు మరింత ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని. ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మత్స్యకారులకు ఫిషరీస్ కాలేజీలు అలాగే ఫిష్ మార్కెట్లు… మత్స్యకారులు చేపల విక్రయించేందుకు టూవీలర్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవి కుమార్ యాదవ్ .. మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ..సింగిల్ విండో అధ్యక్షులు గాడి కృష్ణమూర్తి లక్ష్మీకాంత్ రెడ్డి వైఫ్ ఎంపీపీ కోటేశ్వర్ .. మత్స్య కార్మిక ఏ డి ఎస్ఎ రెహమాన్ ..తాసిల్దార్ కె శ్రీనివాస్.. మత్యకారుల సంఘం మండల అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్.. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవి కుమార్ యాదవ్ ..మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడ్.. టిఆర్ఎస్ నేతలు రాయచూర్ వీరేశ లింగం.. విష్ణువర్ధన్ రెడ్డి .. అనిల్ కుమార్ గౌడ్.. సిరాజుద్దీన్ వేణుగోపాల్ రెడ్డి .. విష్ణువర్థన్ రెడ్డి.. కౌన్సిలర్లు పోషణ చెన్నయ్య రామకృష్ణ.. టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మనీ వర్ధన్ రెడ్డి ..ఎస్సి సెల్ అధ్యక్షులు కర్రే శీను ..మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జానకి రాములు.. రామ కృష్ణ యాదవ్ మచ్చేందర్ గౌడ్ .. ఆనంద్ గౌడ్ మత్స్యకారులు సంఘం ప్రధాన కార్యదర్శి పోషణ మచ్చ కారుల సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ రాజు.. కృష్ణ బాలస్వామి.. శ్రీను.. ధర్మయ్య పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.