పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత ఆ దంపతులు వెడ్డింగ్ ఫొటో షూట్ జరిపుకోవడం విశేషం..ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. తమ ఏడేళ్ల కుమారైతో కలిసి ఆ జంట ఈ వెడ్డింగ్ షూట్ ని చేశారు. అదేంటి పెళ్లికి చేస్తారుగా అనుకుంటున్నారా..వీరిది ప్రేమ పెళ్లి..అనీష్, డాక్టర్ వైయస్ రజిత ప్రేమించి పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు.కానీ ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా వీరి పెళ్లి జరగాలని అనీష్ తల్లి కండిషన్ పెట్టడంతో పెళ్లి కూతురి ముస్తాబు లేకుండానే వారి వివాహం జరిగింది. అయితే అసలైన ముచ్చట తీరకపోవడం రజిత జీవితంలో లోటుగా ఉండిపోయింది. పరిస్థితులు మారాయి.ఎవరికి వారు జీవితంలో స్థిరపడ్డారు. దాంతో భార్యని సంతోషపెట్టేందుకు వారి పెళ్లిరోజు వేడుకని ఘనంగా నిర్వహించాడు అనీష్.ఈ మేరకు అనీష్, రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు. ఈసారి రజిత ముఖంలో చిరునవ్వు మెరిసింది. తిరువనంతపురం లోని అట్టుకల్ దేవాలయం, శంఖుముఖం బీచ్ తో సహా వివిధ ప్రదేశాలలో సేవ్ ది డేట్, ఫ్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ జరిగింది.
అందంగా తీసిన ఫోటోలు డిజిటల్ ఆల్బమ్ గా మారాయి. ఆ జంట ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఆల్బమ్ తయారయింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు సూపర్ హిట్ అయ్యాయి.అనీష్ తన భార్య కోసం ఒక అందమైన కవిత కూడా రాశాడు. అందులో అతను ఆమెను తన జీవితపు ప్రేమ అని పిలుస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… అనీష్ పదిహేనేళ్లలోపు శారీరకంగా వికలాంగులైన పిల్లలకు సహాయం మద్దతును అందించి స్నేహ యాత్ర అనే స్వచ్ఛంద సంస్థను వలియాకొట్టక్కల్ లో నిర్వహిస్తున్నాడు. అతను స్నేహ యాత్ర అనే మారుపేరుతో కూడా రాస్తాడు. ఈ బృందం వరదల సమయంలో చురుకుగా ఉండి, అవసరమైన వారికి అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించి వేరే సంస్థలను కూడా అనీష్ సమన్వయం చేస్తాడు. ఇప్పుడు వీరి వివాహ వేడుక వెడ్డింగ్ షూట్ వైరల్ గా మారింది.