వరంగల్ ప్రభన్యూస్ ప్రతినిధి : ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇవ్వాల (గురువారం) విడుదలచేసింది. ఈనెల 11వ తేది ఉదయం 6 గంటల నుంచి 12వ తేది సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్దులు వెబ్ ఆప్ఖన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలు వెబ్ సైట్‌లో చూడవచ్చు. ప్రాధాన్యతక్రమంలో కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement