వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 9,10వ తేదిల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ మంగళవారం మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వాాం భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
కళాశాల వారీగా సీట్ల ఖాలీల వివరాలు యూని వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈనెల 9న బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10న గురువారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తివివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.