వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 27, 28వ తేదిల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ శనివారం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
కళాశాల వారీగా సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈనెల 27న ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 28న సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒకప్రకటనలో కోరారు.