గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. కాగా సోమవారం మాత్రం వాతావరణంలో మార్పులు రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ చత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియల్ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది.
అయితే దీని ప్రభావం కారణంగా గా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ రూరల్, ములుగు నల్గొండ సూర్యాపేట వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భానుడి ప్రభావానికి బలవుతున్న ప్రజలకు ఇదో శుభవార్త అనే చెప్పాలి.