సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ లో నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని రోడ్లు & భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 9వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భం సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ మహాకవి శ్రీ దాశరధి తెలంగాణ గురించి “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని వివరించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని, బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామముగా కృషి చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 8 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని నేడు 9వ వసంతంలోనికి సగర్వంగా అడుగుపెడుతున్నది. ఈ శుభవేళ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులందరికి మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం అన్నారు. ముఖ్యమoత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృషితో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సఫల రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మనం సాధించిన విజయాలు అసామాన్యమైనవి. ఆనాడు తీవ్రమైన విద్యుత్ కోతలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలైనవని, సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంటపొలాలు పడావుగా నిలిచిన దుస్తితి నెలకొన్నదన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. మొత్తంగా గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు, అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వo ప్రతిష్టాత్మకముగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్లు, రైతుబంధు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి / షాది ముబారక్, ఉచిత చేప పిల్లల పంపిణి, గొర్రెల పంపిణి, కొత్తగా ప్రవేశపెట్టబడిన దళిత బంధు, మన ఊరు – మన బడి మొదలైనవి అమలు జరుగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement