Sunday, September 8, 2024

TS | 2029 నాటికి తెలంగాణలో అధికారం చేపడతాం : జేపీ నడ్డా

బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపినద్ద తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలోని ప్రగతిమైదాన్ భారత్ మండపంలో ఇవ్వాల (శనివారం) బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు గతంలో 7 శాతం ఉండగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగిందన్నారు. ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తు చేశారు.

రానున్న ఐదేళ్లలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తామన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రతినిధులకు నడ్డా వివరించారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement