ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడుల నేపథ్యంలో రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టెలిగ్రాం ఛానెల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ”మేరియాపోల్ మాత్రమే కాదు, కీవ్‌పై కూడా దాడి చేస్తాం. ముందుగా లుహాన్స్, డోనెట్స్ ప్రాంతాలకు విముక్తి కలిగిస్తాం. ఆ త్వాత కీవ్, ఇతర నగరాలను కూడా స్వాధీనం చేసుకుంటాం” అని స్పష్టంచేశారు. తనను తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనికుడిగా చెప్పుకునే కడీరోవ్ కీవ్ విషయంలో ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క అడుగు కూడా వెనక్కు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో తాను హామీ ఇస్తున్నానని అన్నారు. మానవ హక్కులను కాలరాశారంటూ అమెరికా సహా యూరోపియన్ దేశాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..