Tuesday, November 26, 2024

టమాటా రైతులను ఆదుకుంటాం : మంత్రి గుమ్మానుర్ జయరాం

ఆలూరు : రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనుర్ జయరాం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయ‌న మాట్లాడుతూ.. గత శనివారం ఆదోని లో డివిషన్ స్థాయి అధికారులు సమావేంలోనూ ఈ ప్రాంత అభవృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని చర్చలు జరిపామన్నారు. టమాటా రైతులను ఆదుకోవడంలో దృష్టి సారించామన్నారు. ఈ నియోజక వర్గంలో అధికంగా టమాటా సాగు చేస్తున్నారు. టమాటా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళ‌న చెందుతున్న మాట వాస్త‌మే.. వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌న్నారు. టమాటా జూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యాడని తెలిపారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆలూరు నియోజకవర్గం లో జింకల పార్క్ ఏర్పాటు తదితర వాటిని విస్మరించి రైతులకు తీవ్రంగా అన్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement