నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ఛండీ హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆలయం వద్ద ఎమ్మెల్యే రోజాను తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడిన జిల్లా బాలాజీలో నగరి నియోజకవర్గం ప్రధానంగా ఉన్నదని, మరికొంత చిత్తూరు జిల్లాలో ఉన్నదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. తమ నియోజకవర్గం నగరి రెండు జిల్లాల్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజల తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అంటే.. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని సీఎం జగన్‌కు వినతి అందజేస్తామని తెలిపారు.కొందరు కొత్త జిల్లాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కొత్త జిల్లాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకురావడానికి మార్చి 2వ తేదీ వరకు జగన్ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని వివరించారు. కానీ, కొంత మంది కావాలనే కొత్త జిల్లాలపై అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..