Wednesday, November 20, 2024

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం.. విద్యుత్‌ రంగంలో ఇంజనీర్ల కృషి మరవలేనిది..

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రిని కలుద్దామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం విద్యుత్‌సౌధలో జరిగిన తెలంగాణ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ 2022 డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఉద్యోగలనుద్దేశించి మాట్లాడారు. ముందుగా ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి, టీఈఈఏ అధ్యక్షులు ఎన్‌. శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టిలతో కలిసి 2022 సంవత్సరానికి సంబంధించిన డైరీని, క్యాలండర్‌ను ఆవిష్కరించారు. పవర్‌ సెక్టార్‌లో పని చేయడం మన అదృష్టమన్నారు. దేశంలో మన పవర్‌ సెక్టార్‌ను కేసు స్టడీగా తీసుకుని పరిశీలిస్తున్నారని, ఈ స్థాయికి రావడానికి సమిష్ట కృషి అని ఉద్యోగులను అభినందించారు. దేశం గర్వించదగిన విధంగా చరిత్ర సృష్టించామని, ఇటీవల దేశంలో పవర్‌ కోతలు వస్తే మన రాష్ట్రంలో మాత్రం కోతలు లేకపోవడమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విద్యుత్‌ను అందించామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్‌ రంగంలో ఇంజనీర్లు చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆర్టిజన్‌ కార్మికుడి నుంచి సీజీఎం వరకు అందరి కృషితో దేశ స్థాయిలో తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇందులో ఇంజనీర్ల పాత్ర టెక్నికల్‌గా మరింత ప్రొత్సాహనిచ్చిందన్నారు. సంస్థ అభివృద్ధికి సాంకేతికంగా బలంగా ఉంటే సరిపోదని, ఆర్థికంగా కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. బాలెన్స్‌ షీట్‌ బాగుంటే సంస్థ మరింత అభివృద్ధి పథం వైపు దూసుకుని పోతుందన్నారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని, మీటర్‌ సెల్స్‌ పెంచడానికి కృషి చేయాలన్నారు. మీటర్‌ సెల్స్‌ పెరిగితే సహాజంగానే కలెక్షన్‌ పెరుగుతుందని తెలిపారు. ఈపీఎఫ్‌ నుంచి జీఫీఎప్‌ విషయం మాట్లాడుతు 94-95 సంవత్సరంలో టైపార్ట్‌ అగ్రిమెంట్‌లో సంతకాలు చేశామని, ఆ తర్వాత రిక్రూట్‌ అయిన వారికి పీఎఫ్‌ వర్తించదని స్పష్టంగా పేర్కోన్నట్లు తెలిపారు. ఇందులో అన్ని యూనియన్ల సంతకాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికి ఈ విషయంపై అన్ని సంఘాలతో మాట్లాడి ముఖ్యమంత్రితో కలిపిస్తానని హమీ ఇచ్చారు. కొత్త పీఆర్‌సీ విషయంలో కూడా అన్ని సంఘాల ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి : శ్రీకాళహస్తి బ‌స్టాండ్‌లో సూట్‌కేసు క‌ల‌క‌లం.. బాంబ్‌స్వ్కాడ్ వ‌చ్చి చూస్తే…

ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. టీఈఈఏ అధ్యక్షులు శివాజీ మాట్లాడుతు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీవో ప్రకారం విద్యుత్‌ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ అమలు కావడం లేదని , ఈ విషయంలో యాజమాన్యం పరిష్కారం చూపించాలని సీఎండీని కోరారు. పే రీవిజన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని, ఈఫీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని కోరారు. ఎస్‌జీపీ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, పదోన్నతులను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఈఈఏ ప్రతినిధులు తుల్జారాంసింగ్‌, వెంకట్రామయ్య, తిరుపతయ్య, నర్సింహారెడ్డి, రాజేష్‌, రవి, సుశీల్‌కుమార్‌, లక్ష్మయ్య , ప్రవీణ్‌కుమార్‌, లింగమూర్తి, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గోన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement