Thursday, September 12, 2024

TG: హాస్ట‌ళ్ల‌లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం… మంత్రి శ్రీధర్ బాబు

శంషాబాద్, సెప్టెంబర్ 1(ప్రభ న్యూస్) : హాస్ట‌ళ్ల‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని తెలంగాణా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శంషాబాద్ పాలమాకుల్ గ్రామంలో కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలికాల పాఠశాల‌ను తెలంగాణా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ శశాంక సంద‌ర్శించారు.

ఈసంద‌ర్భంగా మంత్రి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు భోజనం చేశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement