న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజధానిగా అమరావతి కేసును ఈనెల 23న విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సుప్రీంకోర్టుకు విజ్ణప్తి చేసింది. రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మరోవైపు కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని వారు కోరారు. దీంతో అమరావతి కేసును ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది.