Saturday, November 23, 2024

భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

భద్రాచలం: భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. భద్రాద్రి చేరుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేదాశీర్వచంనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంత‌రం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పురుషోత్తమ పట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు, మాన్యాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఆక్రమణల నుంచి భుములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇప్పటికే అక్కడ ఆక్రమ కట్టడాలను కూల్చివేశామని వెల్లడించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గోసేవలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement