Thursday, November 21, 2024

కీసరలో చింతన్ శిబిర్ నిర్వ‌హిస్తాం : సీఎల్పీ నేత బ‌ట్టి విక్ర‌మార్క

రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ లో పార్టీ పక్షాన ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ముందుకు పోవడానికి మేడ్చల్ జిల్లా కీసర దగ్గర బాలవికాస్ లో చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నామ‌ని జూన్ 1 ,2 తేదీల్లో చింతన్ శిభిర్ ఉంటుంద‌ని అని సీఎల్పీ నేత బ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. 2023 ఎన్నికలతో పాటు తెలంగాణ సమాజ అభివృద్ధి కి చింతన్ శిబిర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు, ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య నేతలు పాల్గొంటారు. వారందరి అభిప్రాయాలను తీసుకుంటామి, రాజస్థాన్ చింతన్ శిబిర్ లో జాతీయ స్థాయిలో తీసుకున్న అంశాలను, రాష్ట్ర స్థాయి సమస్యలపై వచ్చిన అంశాలను క్రోడీకరించి రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదయపూర్ చింతన్ శిబిర్ లో 6 గ్రూపులను ప్రకటించారు, ఆ కమిటీలో లోతుగా చర్చించిన అంశాలను సీడబ్ల్యూసీలో చర్చించి కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయాలు తీసుకువచ్చార్నారు. రాష్ట్ర పార్టీ కూడా ఏఐసీసీ ని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందుకు వెళ్లడానికి వివిధ అంశాలపై లోతుగా చర్చించి నివేదిక ఇవ్వడానికి ఆరు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ఆర్థికం, రాజకీయం, ఆర్గనైజేషన్, వ్యవసాయం, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రూపులలో ప్రకటించి వీటికి సీనియర్ నాయకులను కన్వీనర్ గా నియామకం చేస్తామ‌న్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పీఏసీలో చర్చించి అనుమతి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పాలసీగా ప్రకటన చేస్తామ‌న్నారు. చింతన్ శిబిరం లో మొదటి రోజు ఆర్థిక.. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ప్రణాళికలు, ఆర్గనైజేషన్, పార్టీ బలోపేతం, వ్యవహరించాల్సిన అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ ఉపాధ్యక్షులు జి.నీరంజన్, సంగిశెట్టి జగదీష్, రాచమల్ల సిద్దేశ్వర్, కొమురయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement