ప్రభన్యూస్ ప్రతినిధి,భూపాలపల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మెడలు వంచేది భారతీయ జనతా పార్టీనేని, 9ఏళ్ళుగా సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌లో ఉంటూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు, నియోజక వర్గ ఇంచార్జ్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి అధ్యక్షతన జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ నా రాజకీయ గురువు అని ఎద్దేవచేశారు. 119 నియోజకవర్గాలలో ఈ బహిరంగ సభ కొనసాగుతుందన్నారు.
పాదయాత్రలో భాగంగా 35లక్షల కుటుంబాల బీజేపీ నాయకులు కలిసి రాష్ట్రంలో బీజేపీ రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో మోడీ హీరోగా ఉంటే రాష్ట్రంలో మోడీ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో 3కోట్ల మందికి ప్రధాని ఆవస్ యోజన ఇండ్లు నిర్మించి ఇచ్చాము. 12కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. 10కోట్ల మండికి మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చామన్నారు. 80కోట్ల మందికి రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. ప్రజలకు ఉచితంగా కోవిడ్ వాక్సిన్ పంపిణీ చేశామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తమ ఫొటోలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటుంన్నారు. ప్రజల కొరకు దేశ వ్యాప్తంగా ఆయుషుమాన్ భారత్ పథకం అమలు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేసీఆర్ ను చర్చకు రమ్మంటే తోక ముడుచుకుని పారిపోయారన్నారు.
ఇచ్చిన హామీలు విస్మరించిన మూర్కుడు కేసీఆర్ అని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు కేసీఆర్ ఫోజులిస్తున్నాడన్నారు. రైతులకు రుణమాఫీ లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదన్నారు. బీజేపీ కి ఓట్లు వేస్తే మోటర్లకు మీటర్లు పెడతారని అసత్య ప్రచారాలు చేశారన్నారు. సింగరేణిలో కేంద్రం వాటా 49శాతం , రాష్ట్ర వాటా 51శాతం ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రయివేటికణ ఎలా చేస్తుందన్నారు. సింగరేణికి 25వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం సింగరేణిని ఎటిఎం లాగా వాడుకున్నారు.బీజేపీ ని బూచిగా చూపి సింగరేణి ని కేసీఆర్ దోచుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లిస్తామన్నారు. మోడీకి కేసీఆర్ కి నక్కకి నాగలోకనికి ఉన్న తేడా ఉందన్నారు.
మోడీ రాష్టానికి వచ్చిన ప్రతిసారి కేసీఆర్ కి కరోనా వస్తుంది. మోడీని చూస్తే కేసీఆర్ కి చెడ్డి తడుస్తుందన్నారు. బీజేపీ , బిఆరెస్ ఒక్కటే అని కాంగ్రేస్ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. కాంగ్రేస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు రావడం లేదన్నారు. కేసీఆర్ కి దమ్ముంటే కాంగ్రేస్ నుండి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు రావాలి. ఇక్కడ చెతి గుర్తుతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే కారెక్కాడని అన్నారు. బిఆరెస్ కాంగ్రేస్ లు రెండు కలిసి కుట్రలు చేస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో స్థానికంగా ఒక్క ఎకరాకు నీరు అందించలేదన్నారు. ఒక్కసారి బీజేపీ రాష్ట్రంలో అధికారం ఇస్తే ఉచిత విద్య , ఉచిత వైద్యం, నిరుపేదలకు ఇండ్లు, జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దశాబ్ది ఉత్సవాలు దేనికోసం..
తెలంగాణలో ప్రజలకు బిఆర్ యస్ ప్రభుతం ఏం వొరగపెట్టారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నారని కీర్తి రెడ్డి ఏద్దేవా చేశారు. బెల్ట్ షాపులు పండుగ చేయడం మార్చి పోయారని అన్నారం ఆర్టిసి , కరెంట్ చార్జీలు పెంచినందుక,రైతు రుణమాఫీ చేస్తానని చేయనందుక అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. ఆశల నుండి కార్యదర్శుల వరకు ధర్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం 18 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తుంటే ఇక్కడ బోనస్ ఎందుకు ఇవడం లేదన్నారు. ప్రధాన మంత్రి ఎరువులు సబ్సిడీ పై ఎరువులు ఇస్తుంటే ఇక్కడ ఫ్రీ గా ఇస్తానన్న ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రైతు ద్రోహి కేసీఆర్ అన్నారు. ఫసల్ భీమా పధకం తెలంగాణలో ఎందుకు చేయడం లేదన్నారు. మహిళలపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు దారుణాలకు వొడిగడుతుంటే మహిళలు బహిరంగంగా బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ కు కనబటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ బిజెపిని కీర్తి రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల తల్లి దండ్రులకు కూడా ఫెంక్షన్ అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెడతమన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కన్నం యుగంధర్, రాష్ట్ర నాయకులు వెన్నంపల్లి పాపయ్య ,బిజెపి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాగపురి రాజమౌళి గౌడ్,కృష్ణ ప్రసాద్, చదువు రామ్ చంద్ర రెడ్డి, మంథని నియోజక వర్గ ఇంఛార్జి చందుపట్ల సునీల్ రెడ్డి,జిల్లా ఇంఛార్జి ఉదయ్ ప్రతాప్ ,ప్రసాద్,శివనాత్రి వేణు, నిషిదర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గొర్రె శశి, మధుసూధన్ , డి.రాజేందర్ , జిట్ట బోయిన సాంబయ్య, సత్యవతి తదితరులు పాల్గొన్నారు