రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోస్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో.. చైనా ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ ఆయుధాలను వదిలి లొంగిపోతే.. చర్చలకు సిద్ధమని సెర్గే చెప్పడంతో.. తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమంటూ చైనా ప్రకటించింది. శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని జిన్‌పింగ్ కోరినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పుతిన్, జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పుతిన్‌కు జిన్‌పింగ్ సూచించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులపై పుతిన్‌తో జిన్‌పింగ్ చర్చించినట్టు సమాచారం.