ప్రజా పాలనలో.. హైదరాబాద్ రైజింగ్ అవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఏడాది సంబురాలను ప్రస్తావిస్తూ ఈ చారిత్రక హైదరాబాద్ మహానగరాన్ని విశ్వవేదికపై వైభవంగా నిలిపే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందని, నిన్న నేడు రేపు.. తమ ఆలోచన, ఆచరణ.. కార్యాచరణ అదేనని వివరించారు.
దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లి, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
వైకల్యం దేనికీ అడ్డురాదు
వైకల్యం దేనికీ అడ్డురాదని, ఆత్మస్థైర్యంతో అవిటితనాన్ని జయిస్తూ ముందుకు కదులుతున్న దివ్యాంగులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.