Tuesday, November 19, 2024

Telangana | ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తాం.. ఉత్తర తెలంగాణ అంటే ఎంతో ఇష్టం: సీపీ రెమా రాజేశ్వరి

గోదావరిఖని, (ప్రభన్యూస్‌): శాంతి భద్రతల పరిరక్షణ తమ ధ్యేయమని, కమిషనరేట్‌ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం సీపీగా బాధ్యతలు స్వీకరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని, మొదటి పోస్టింగ్‌ ఏఎస్పీగా జగిత్యాలలోనే పనిచేశానని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటే ప్రత్యేక అభిమానమన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు మంచి పేరుందని, రాబోయే రోజుల్లో మరింత ప్రతిష్ట పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ఏడాది అయినందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కొసం 24 గంటల పాటు పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీ రెమా రాజేశ్వ‌రి చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సమస్యలుంటే ప్రజలు నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీపీకి ఏసీపీలు ఎడ్ల మహేశ్‌, గోపతి నరెదర్‌, గిరి ప్రసాద్‌, మోహన్‌, ఇన్స్‌పెక్టర్లు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, సతీష్‌, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌, రమేశ్‌ బాబు, ప్రసాద్‌రావు, సంజీవ్‌, జగదీశ్‌, రాజ్‌కుమార్‌, ప్రమోద్‌రావు, ప్రవీణ్‌, విద్యాసాగర్‌, నారాయణ నాయక్‌, కృష్ణారెడ్డి, అశోక్‌, సత్యనారాయణ, భీమేశ్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, ముత్తు లింగయ్య, శంకరయ్య, ప్రవీణ్‌, నరేశ్‌లతోపాటు ఎస్‌ఐలు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement