Thursday, November 21, 2024

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తాం… కార్యకర్తలు అధైర్య పడొద్దు… వనమా

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని… కార్యకర్తలు అధైర్య పడొద్దని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. హైకోర్టు తీర్పుపై ఆయన మాట్లాడుతూ… కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, ప్రజలారా, ఎవరూ అధైర్య పడొద్దన్నారు. తాను ప్రజా బలంతో గెలిచానని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేశానన్నారు. గతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులకు హైకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టులో స్టే ఇచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. తనకు గౌరవ కోర్టుపై నమ్మకం ఉంది, మీరు ఎవరూ అధైర్య పడకుండా ఉండండన్నారు.

తాను కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచానని, దొంగ చాటుగా కోర్టులో కేసులు వేసి తీర్పుల ద్వారా ఎమ్మెల్యే అయిన వ్యక్తిని కాదన్నారు. తనకు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల బలం ఉంది, నాయకులు, కార్యకర్తల బలం ఉందన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వనమా ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల కోలాహలం ఉంది. తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యే వనమా వెంటే ఉన్నారని, ఎమ్మెల్యే వనమా వెంటే తాము అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై కేసీఆర్ జై వనమా జై జై వనమా అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement