Saturday, November 23, 2024

పది సెకన్లలో నాశనం చేసేస్తాం.. ఫిన్‌లాండ్‌కు రష్యా హెచ్చరిక

మాస్కో : నాటో కూటమిలో చేరతామన్న ఫిన్‌లాండ్‌ ప్రకటనతో రష్యా నిప్పులుకక్కుతోంది. ఆ కోపాన్ని బాహాటంగానే చాటుతోంది. నాటోలో చేరిక నిర్ణయం ఫిన్‌లాండ్‌ తీసుకున్న పెద్ద తప్పుడు నిర్ణయమని శనివారం రష్యా ప్రకటించింది. రష్యా డిఫెన్స్‌ కమిటీ డిప్యూటీ చైర్మన్‌ అలెక్సీ ఝురవ్‌ల్యోవ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే అణుదాడికి వెనుకాడబోమని, కేవలం పది సెకన్లలో ఫిన్‌లాండ్‌ను, మూడు నిమిషాల్లో బ్రిటన్‌ను సర్వనాశనం చేయగలమని హెచ్చరించింది.

ఒకవేళ అమెరికా అండగా ఉంటుందనుకుంటారేమో.. ఆ దేశం కోసం సర్మత్‌ క్షిపణి సిద్ధంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం ఫిన్‌లాండ్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన రష్యా తాజా హెచ్చరికలు చేసింది. నార్డిక్‌ దేశమైన ఫిన్‌లాండ్‌ తన విద్యుత్‌ అవసరాల్లో పదిశాతం రష్యానుంచి కొనుగోలు చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement