భారతదేశంతో సంబంధాలను పెంపొందించుకోవడానికి, పరస్పర సహకారానికీ ఇటలీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి జియోర్జియా మెలోనీ అన్నారు. భారత ప్ర భుత్వంతో కలిసి అంతర్జాతీయ స్థిరత్వం మరియు గ్లోబెల్ సవాళ్లపై పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మెలోనీ బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇటలీ నూతన ప్రధానిగా ఎన్నికైన తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
జియోర్జియో మెలోనీ ఇటలీకి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు నెలకొల్పారు. ఇటలీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఫ్రటెల్లి డిఇటాలియా పార్టీ రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి అధికారం దక్కించుకోవడం విశేషం. ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 25 శాతం ఓట్లను ఫ్రటెల్లి డి ఇటాలియా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఇటలీ మొట్టమొదటి మహిళా ప్రధాని జియోర్జియా మెలోనీకి, ఆమె పార్టీ ఫ్రటెల్లిడి ఇటాలియాకు అభినందనలు తెలిపారు.