మహిళల హక్కులు తమ ప్రాధాన్యం కాదని తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ అన్నారు. అఫ్గానిస్థాన్‍లో మహిళలు, బాలికలపై కఠిన ఆంక్షలపై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్‍లో మహిళ హక్కులను తాలిబన్ ప్రభుత్వం హరిస్తూనే ఉంది. ఈ విషయంలో చాలా దేశాల నుంచి తాలిబన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో మహిళలు చదువుకోవడంపై తాలిబన్లు నిషేధం విధించారు. దీంతో తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు అధికమవుతున్నాయి. మహిళలకు విద్య, ఉద్యోగావకాశాలను కల్పిస్తామని తాలిబాన్లు చెప్పినప్పటికీ ఆ దిశగా వారు ఒక్క అడుగు కూడా వేయలేదు. అంతేకాదు రోజురోజుకూ మహిళల హక్కులను హరిస్తూ వస్తున్నారు. అక్కడి మహిళలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. తాజాగా తాలిబాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ మాట్లాడుతూ… మహిళలపై ఆంక్షలను రద్దు చేయడం కుదరదని చెప్పారు. ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించే చర్యలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. షరియా చట్టాన్ని వ్యతిరేకించేవారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. షరియా చట్టానికి లోబడే అన్ని అంశాలను నియంత్రిస్తామని తెలిపారు. మహిళల హక్కులకు ప్రాధాన్యతను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement