రష్యా నుంచి క్రూడాయిల్ ధరను డిస్కౌంట్‌కు కొనుగోలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినందున దేశ ప్రజల కోసం తక్కువ ధరకు చమురు కొనుగోలు అవసరమని అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి కొనుగోలును ఇప్పటికే భారత్ ప్రారంభించిందన్నారు. మంచి ఒప్పందం కోసం భారత్ ఎదురుచూడటం సహజమైన ప్రక్రియే అని తెలిపారు. రష్యా నుంచి ఇప్పటికే చమురు కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. రష్యా నుంచి మూడు నుండి నాలుగు రోజుల ఆయిల్ సరఫరా కూడా అందుకున్నట్టు తెలిపారు. మరింత చమురు కోసం అవసరమైన ప్రణాళికలపైన పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కసరత్తు చేస్తున్నారని తెలిపారు.
జాతీయ ప్రయోజనాలు, ఎనర్జీ, ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యమని వివరించారు. డిస్కౌంట్‌లో ఇంధనం దొరుకుతుంటే.. తాము ఎందుకు కొనుగోలు చేయవద్దని ప్రశ్నించారు. ఉక్రెయిన్ పైన యుద్ధం కంటే ముందు ఉన్న చమురు ధర కంటే బ్యారెల్‌కు 35 డాలర్ల డిస్కౌంట్ భారత్‌కు ఇచ్చేందుకు కూడా రష్యా ముందుకొచ్చింది. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు చమురు అమ్మకాలు బాగా తగ్గడంతో రష్యా ఈ ఆఫర్ భారత్‌కు ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు చెల్లింపుల కోసం రూపాయి-రూబుల్ డినామినేషన్‌ను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..