Monday, November 25, 2024

TG: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయిస్తాం… నాగార్జున

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్‌ కూల్చివేతలు బాధాకరమన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందని తెలియజేశారు.

కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని, తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా కూల్చివేశారని మండిపడ్డారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తానే కూల్చివేతను నిర్వహించేవాడినని, తాజా పరిణామాలతో ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందన్నారు.

దీంతో తాము అక్రమాలకు పాల్పడ్డామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాగార్జున తన బాధను వ్యక్తం చేశారు. మాది పట్టాభూమి అని, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, ప్రైవేటు స్థలంలోనే భవనం నిర్మించామని చెప్పారు. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement