మెగా బ్రదర్ నాగబాబు ఇంట వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయి. తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి గురించి తాజాగా నటుడు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలో అనౌన్స్ చేస్తాం. తన పెళ్లి గురించి వరుణ్ బాబు కూడా మీడియాకి అనౌన్స్ చేస్తారు. త్వరలోనే ఉంటుంది. ఇంటర్వ్యూలో యాంకర్ కోడలి గురించి ప్రస్తావించగా.. నేను ఇప్పుడే ఏమీ కామెంట్ చేయను అని నాగబాబు దాటవేశారు.
ఒక ప్రముఖ వ్యక్తి మీ ఇంటికి కోడలిగా రాబోతోంది అది నిజమేనా అన్నట్లు యాంకర్ ప్రశ్నించగా నాగబాబు ఖండించలేదు. సమాధానం చెప్పకుండా దాటవేశారు.నాగబాబు అలా తన కోడలి గురించి హింట్ ఇచ్చినట్లే అని అంటున్నారు. దీనితో వరుణ్ లవ్ ఎఫైర్ గురించి వస్తున్న ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.
తనతో కలసి నటించిన ఓ క్రేజీ హీరోయిన్ తో వరుణ్ తేజ్ డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ అమ్మాయినే వరుణ్ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీగా ఒక్కటిగా ఉన్నప్పటికీ.. నిహారిక, వరుణ్ తేజ్ లకి తాను స్వేచ్ఛ ఇస్తానని నాగబాబు అన్నారు. వారి పర్సనల్ లైఫ్స్ ని గౌరవిస్తా. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది అని నాగ బాబు అన్నారు. మొత్తంగా ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ వయసు 33 ఏళ్ళు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా ఉన్నారు. ఇటీవలే శర్వానంద్ నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కూడా అదే బాటలో పయనిస్తుండడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.