దివ్యాంగులకు రాజ్యాంగబద్ద ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అఖిలభారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, చిన్నపిల్లలు, ఇతరులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడుతున్న ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఎందుకు కమిషన్ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై చర్చించాలని కేంద్ర మంత్రిని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని, హైదరాబాద్లో దివ్యాంగుల పరికరాల తయారీ కంపెనీని నెలకొల్పాలని అథవాలేను అభ్యర్థించినట్టు నాగేశ్వరరావు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital