కాంగ్రెస్‌లో సరైన గౌరవం లభించడం లేదని హార్ధిక్ పటేల్ విమర్శించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అతనికి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. కాంగ్రెస్‌తో ఇబ్బంది ఉంటే తమ పార్టీలో చేరాలని సూచించింది. ఈ సందర్భంగా గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా మాట్లాడుతూ.. హార్ధిక్ పటేల్ కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్)ను హార్ధిక్ పటేల్ స్థాపించాడు. పాటిదార్‌ల తరఫున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీని కోసం ఆప్ హార్ధిక్ పటేల్‌కు సముచిత స్థానం కల్పిస్తుందని, పాటిదార్ కమ్యూనిటీ కోసం యువ నేత ఆందోళనలు ఆప్ చూస్తూనే ఉందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ పటేల్ సంతోషంగా లేరని, ఆ పార్టీని వీడి వెంటనే ఆప్‌లో చేరాలని సూచించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ తమదే అని, ఒక వేళ హార్ధిక్‌కు దీనికి అంగీకరిస్తే.. కచ్చితంగా పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నరేష్ పటేల్‌కు కూడా తాము పార్టీలో ఆహ్వానించామని ఇటాలియా గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడే వారందరి కోసం ఆప్ తన తలుపులు తెరిచే ఉంచిందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..