రేవంత్‌ను దించేయాలని మాకు లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల వరకు రేవంత్‌ను మార్చొద్దు.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిదో, జగ్గారెడ్డిదో కాదన్నారు. ప్రతి శనివారం కాంగ్రెస్ మీటింగ్‌లు జరగడం లేదని, నిర్ణయాన్నీ రేవంత్ తీసుకుంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. అందరిని కలుపుకొని నిర్ణయాలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. తాను మట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిస్తున్నారు అంటున్నారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో అసమ్మతి ఉంటుందని, కొందరు అసమ్మతిని కోవర్టులు అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే తాను సంపూర్ణంగా సహకరిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement