భారత్ సహా ఏ దేశమూ రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం తమకు నచ్చదని, ఈ విషయాన్ని భారత్‌కు స్పష్టంగా చెప్పామని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా, భారత్ తటస్థవైఖరి అనుసరిస్తూండటాన్ని తప్పుబడుతోంది. తన వైఖరిని మార్చుకోవాలని, రష్యానుంచి ఆయుధాలు, చమురు దిగుమతులను నిలిపివేయాలని, ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయినా భారత్ తన అవసరాలు, రష్యాతో సుదీర్ఘ మైత్రి నేపథ్యంలో అమెరికా మాటను ఖాతరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆధారపడటాన్ని తాము ప్రోత్సహించబోమని, అదే సమయంలో భారత్‌తో రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
భారత్‌తో రక్షణ బంధం తమకు ఎంతో కీలకమని, భారత్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రక్షణఛత్రంలా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రష్యానుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఆ దేశంతో 2018లో 5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అమెరికా గుర్రుగా ఉంది. ఒక దశలో భారత్‌పై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం బెదరించింది. ఆ తరువాత ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ఆయుధాల కొనుగోళ్లు, చమురు దిగుమతుల విషయంలో తన ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. ఇది అమెరికాకు నచ్చడం లేదు. అధ్యక్షుడు జో బైడెన్ సహా ఐరోపా దేశాలు కూడా భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కిర్బి అదే పాట పాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..