Tuesday, November 26, 2024

Delhi | మేము పారిపోలేదు, ప్రజాస్వామికంగా వ్యవహరించాం.. బీజేపీకి బీఆర్ఎస్ కౌంటర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అవిశ్వాసంపై ఓటింగ్ నుంచి తాము పారిపోలేదని, ప్రజాస్వామికంగా వ్యవహరించామని బీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ప్రతిపక్షాల గురించి కేంద్ర పెద్దలు అబద్ధాలు చెప్తుండడం వల్లే సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ, దేశ సమస్యల గురించి మాట్లాడాలని,మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని పట్టుబట్టామని తెలిపారు. అయినా రాజ్యసభకు రాకుండా ప్రధాని ముఖం చాటేశారని లింగయ్య విమర్శించారు.

కేసీఆర్ గురించి అసత్యాలు మాట్లాడిన బండి సంజయ్ ని లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ఇంటి పేరు గురించి మాట్లాడితే రాహుల్ ను సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు కేంద్రం ఏ విషయంలో కూడా సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమాన్ని అందిస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలబెట్టారని వివరించారు. డిపాజిట్లు కూడా రావనే కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement