Thursday, December 12, 2024

TG | ఏడాదిలోనే రికార్డులు సృష్టించాం : సీఎం రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​:​ ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల సంద‌ర్భంగా సీఎం రేవంత్ ప్ర‌జ‌ల‌కు ఓపెన్ లెట‌ర్ రిలీజ్ చేశారు. తెలంగాణ‌లో మీ సొంత‌ ప్రభుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా అని అందులో పేర్కొన్నారు.

ఆదివారం సీఎం రేవంత్ ఎక్స్ వేదిక‌గా చేసిన ఈ ట్వీట్‌ను తెలంగాణ సీఎంవో రీ ట్వీట్ చేసింది. ఇక‌.. సీఎం రేవంత్ పేర్కొన్న దాంట్లో ఈ మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో ప్రభుత్వం రికార్డు సృష్టించింద‌ని తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలు ఇతర ప్రభుత్వాల వంటి అంశాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గుతోంద‌న్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌లో ప్ర‌ధానంగా మ‌హిళా సంక్షేమం, రైతులు, హౌసింగ్‌, ఆర్థిక వృద్ధి, ప‌ట్ట‌ణాభివృద్ధి, యువ‌త‌కు ఉద్యోగాలు, కుల గ‌ణ‌న వంటి అంశాలున్నాయి. కాగా, మహిళా సంక్షేమం కోసం ఉచిత బస్సు, ఉచిత డొమెస్టిక్ పవర్ (200 యూనిట్ల వరకు), ₹500 వంట గ్యాస్ సిలిండర్ అందించినట్టు తెలిపారు.

  • 25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, ₹21,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఎంఎస్​పీ కంటే ఎక్కువ ఉన్న సన్న బియ్యం క్వింటాల్‌కు ₹500 బోనస్ అందించినట్టు తెలిపారు. అంతేకాకుండా రైతులకు 24/7 ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
  • నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టామని, దీనికి వేగవంతంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
  • ఒక్క ఏడాదిలో యువతకు 55,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను సృష్టించామని సీఎం పేర్కొన్నారు. 12 ఏళ్లలో అత్యల్ప నిరుద్యోగిత రికార్డు సాధించామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, డ్రగ్స్​ వినియోగానికి వ్యతిరేకంగా యుద్ధం చేపట్టామని, స్కిల్స్​ విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం వంటివి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
  • తొమ్మిది నెలల్లో రెట్టింపు ఎఫ్‌డీఐలు తీసుకొచ్చామని, 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు కూడా 200 శాతానికి పైగా పెరిగాయన్నారు. క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీఇమాజినేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టేందుకు దేశంలో హైదరాబాద్‌ను మొదటి నగరంగా మార్చినట్టు తెలిపారు. భారీ వృద్ధి, జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ తదుపరి దశ.. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించనున్నట్టు తెలిపారు.
  • దేశపు మొట్టమొదటి సమగ్ర కుల సర్వే చేపట్టామని, తెలంగాణ పౌరుల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత లభించిందని సీఎం తెలిపారు.
  • ట్రాన్స్‌జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్‌ను నిర్వహించే భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్ అవతరించబోతోందని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యం, ఉదారవాద విలువలను పునరుద్ధరించామని, డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలను తమకు అప్పగించిన తెలంగాణ ప్రజలందరికీ, వారి నమ్మకానికి మరోసారి కృతజ్ఞతలు అంటూ సీఎం రేవంత్​ ట్వీట్​లో పేర్కొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement