న్యూ ఇయర్ కానుకగా ప్రాజెక్ట్-K బృందం రీఇన్వెంటింగ్ ది వీల్ అని వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు మేకర్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో చిత్రబృందం ఒక వీల్‌ను తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారో చూపించారు. ప్రాజెక్ట్-K సినిమా కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమా ఎలా చెయ్యాలో అనడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.
అన్ని కొత్తగా తయారు చేయాలి అంటూ గతంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మాటలను జత చేస్తూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఒక వీల్ కోసం యూనిట్ మొత్తం ఏ విధంగా కష్టపడ్డారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ ఒక్క వీడియోతో ప్రాజెక్ట్-k మూవీ పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతుందని క్లారిటీ వచ్చేసింది. ఒక్క వీల్ కోసం ఇంత కష్టపడితే.. సినిమా కోసం ఇంకెంత కష్టపడుతున్నారో అని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్లో ఈ సినిమా జరుగుతుందని సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.