Thursday, November 21, 2024

War: ఆయుధాలు వీడితే చర్చలకు మేం సిద్ధం.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్‌

ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావ్రోస్‌ కీలక ప్రకటన చేశారు. అయితే ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాలు వదిలేయాల్సి ఉంటుందని నిబంధన విధించింది. చర్చలకు బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ను వేదికగా చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా రష్యాయే ముందు ఉంచింది. చర్చలకు సిద్ధం అయితే.. తమ బృందాన్ని అక్కడికి పంపిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు వీడితేనే చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌ వాసులకు అణిచివేత నుంచి స్వేచ్ఛ కల్పిచేందుకు ఈ సైనిక ఆపరేషన్‌ చేపట్టామని, దీని తరువాత వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చన్నారు. అయితే ఉక్రెయిన్‌ ఎదురుదాడికి దిగుతోందని, ఒక వేళ ఉక్రెయిన్‌ ఆర్మీ సేన ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement