సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో సమస్యలు పరిష్కరిస్తామని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణలో ఉండడమే తమ పనితీరుకు నిదర్శనం అన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు నిర్మించుకున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement