ఇండియా వైపు లేము, ఎన్ డీ ఏ వైపు తాము లేమని సీఎం కేసీఆర్ ఇవ్వాల మహారాష్ట్రలో వెల్లడించారు. ఎవరి వైపు లేమని, ఉండబోమని స్పష్టం చేశారు. తాము ఒంటరిగా లేమని మిత్రులతో కలిసి ఉన్నామని అన్నారు. నయా ఇండియా ఏంటి? 50 సంవత్సరాలు వాళ్లు అధికారంలో ఉన్నా మార్పు రాలేదు. మార్పు జరుగాల్సి ఉందని అన్నారు. వివిధ స్థాయిల్లో తమ పార్టీకీ సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల యుద్ధ గంట మ్రెగించామని, మహారాష్ట్రలో తమ పని ప్రారంభించామని 14 లక్షల 10 వేల మంది పదాదికారులు ఉన్నారని అన్నారు.
ఇప్పటివరకు 50 శాతం పని పూర్తయిందని అన్నారు. మరో 15 నుంచి 20 రోజుల్లో గ్రామగ్రామాన పూర్తిస్థాయిలో పని పూర్తి చేస్తామన్నారు. మహారాష్ట్ర లాంటి అద్భుతమైన రాష్ట్రం లేదని అనేక వనరులున్నాయని అభిప్రాయపడ్డారు. సంపదకు కొదువలేదని, ఉపాధి అవకాశాలు అపారమని అన్నారు. ఔరంగాబాద్ వంటి నగరంలో నీటి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. దళిత సమాజం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. వారికి మహారాష్ట్రలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, అమెరికా వంటి రాష్ట్రం వివక్ష ను విడిచిపెట్టి బరాక్ ఒబామాను అధ్యక్షుడిని చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. వివక్ష పాపాలను అమెరికన్లు అలా కడిగేసుకున్నారని సీఎం అన్నారు.