Tuesday, November 26, 2024

కాంగ్రెస్‌తో నష్టపోతున్నాం.. నాయకత్వ మార్పు తప్పనిసరి : థరూర్‌

ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయని, నాయకతంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. పార్టీలో వ్యవస్థీకృత మార్పులు, లీడర్‌షిప్‌లో సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు గుర్తు చేశాయని తెలిపారు. దేశ ప్రజల్లో కాంగ్రెస్‌ ఐడియాలజీని మళ్లి పునరుద్ధరించేలా వ్యవస్థీకృత నాయకత్వంలో మార్పులు తప్పవన్నారు. గెలవాలంటే.. మార్పు తప్పదని స్పష్టం చేశారు.

ఈ దిశగా వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా చేజారి పోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. అసెంబ్లి ఎన్నికల ఫలితాలతో.. కాంగ్రెస్‌ను నమ్ముకున్న తామంతా నష్టపోతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను నిలబెట్టిన భారత్‌ ఆలోచనను, అది దేశానికి అందించే సానుకూల ఎజెండాను పునరుద్ఘాటించాల్సిన సమయం వచ్చిందన్నారు. అలాంటి ఆలోచనలను పునరుజ్జీవింపజేసే విధంగా నాయకతాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement